పైసలుంటేనే టిక్కెట్టు

  • September 26, 2018 1:44 pm

మహాకూటమి నేతల చేతులో అవమానింపబడిన మహిళ తిరునగరు జ్యోతి ఉదంతం మరువకముందే, పైసల కోసం ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ విరుచుకుపడింది మరో మహిళ రంగు బాల లక్ష్మి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె చేసిన సాహసం మరువలేనిది, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిని, విచాక్షణారహితంగా అమ్మాయిలను కొడుతున్న పోలీసులను ధైర్యంగా ఎదుర్కోడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరితే… నీ దగ్గర ఎన్ని పైసలు వున్నాయి, ఎంత ఖర్చు పెడతావంటూ పార్టీ నాయకులు అడిగి అవమానపరుస్తున్నారంటూ బాల లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదని, మహాకూటమిలో వున్న అన్ని పార్టీల్లోనూ దాదాపు ఇట్లానే వుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆనాడు ఉద్యమ సమయంలో అన్ని పార్టీల నాయకులు మా దగ్గరకు వచ్చి, మాకు పూలదండలు వేసి, మమ్మల్ని ప్రోత్సహించినారు, అప్పుడు లేని డబ్బుల ప్రసక్తి ఇప్పుడెందుకని, ఉద్యమానికి పనికొచ్చిన మేము, టికెట్లకి పనికిరామా అని మహాకూటమి నాయకులను ఆమె ప్రశ్నించారు. దరువు ఎల్లన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చర్లపల్లి జైలు, చెంచల్‌గూడా జైలుకు వెళ్లి ఎన్నో త్యాగాలు చేసిన మాకు టికెట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు.


Connect with us

Videos

MORE