mt_logo

మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి పద్మారావు గౌడ్: కేటీఆర్

ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్ గారు.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనియాడారు.

పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. 2001 నుండి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ హైదరాబాద్ మహానగరంలో గులాబీ జెండాని రెపరెపలాడిస్తున్నారు అని పేర్కొన్నారు.

కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా.. పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు అని తెలిపారు.

పార్లమెంటులో పద్మారావు గౌడ్ గారి గళం.. సికింద్రాబాద్‌కు బలం. కారు గుర్తుకే ఓటేసి.. పద్మారావు గౌడ్‌ని గెలిపించాలని అని పిలుపునిచ్చారు