mt_logo

బిందెడు నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు.. హరీష్ రావుతో మహిళల ఆవేదన

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు.. వెలికట్ట గ్రామంలో మంచినీళ్ల కష్టాలతో ఇబ్బంది పడుతున్న మహిళలను చూసి ఆగి వారితో ముచ్చటించారు.

గత బీఆర్ఎస్ పాలనలో తమ ఇంటి వద్దకే త్రాగునీరు వచ్చేదని ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయని.. ఓ బిందెడు మంచినీళ్లకు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు అన్నారు.

వాళ్ళ సమస్యను ఓపిగ్గా విన్న హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తాగునీటి కష్టాలను తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.