కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ రోజు 43,071 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్ తెలిపారు. నగరంలోని 30 సర్కిళ్లలో నిర్వహించిన ఈ నేత్ర పరీక్షల్లో 4,011 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. మరో 1,640 మందికి శస్త్ర చికిత్సలు జరిపేందుకు రిఫర్ చేశామని తెలిపారు. చార్మినార్ జోన్‌లో 11,015, ఎల్బీనగర్ జోన్‌లో 5,636 ఖైరతాబాద్‌లో 8,649, శేరిలింగంపల్లి జోన్‌లో 3,485, సికింద్రాబాద్ జోన్‌లో 8,376, కూకట్‌పల్లి జోనల్‌లో 5,910 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని దానకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.