మునుగోడు ఉపఎన్నిక మొదలైంది. ఉదయం 7గంటలకు ఓటింగ్ మొదలవగా 11 గంటల వరకు అన్ని మండలాల్లో కలుపుకొని 25.8% పోలింగ్ నమోదయింది. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. వికలాంగులు, వృద్ధులు, నడవలేని వారి కోసం కలెక్టర్ చొరవతో వారిని పోలింగ్ కేంద్రానికి చేరవేసేందుకు ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా…2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉపఎన్నికలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఉపఎన్నిక ఫలితాలు 6వ తేదీన వెల్లడవుతాయి.
