దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ, మంగళవారం కరీంనగర్ చేరుకున్నాడు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న కిరణ్ వర్మను నమస్తే తెలంగాణ పలుకరించింది. గత ఎనిమిది నెలలుగా దేశంలోని కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తదితర రాష్ట్రాల్లో 8,500కిమీలకు పైగా పాదయాత్ర చేశానని వర్మ తెలిపాడు. కానీ ఆ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మాత్రమే రహదారులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి కూడా మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణలో అత్యంత మెరుగ్గా ఉందని, నిబద్ధతతో కూడిన పరిపాలనతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇలాంటి పరిపాలన అన్ని రాష్ట్రాల్లో ఉంటే భారతదేశం అనతికాలంలోనే ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి నెం.1 స్ధానంలో ఉంటుందని స్పష్టం చేస్తూ, ముందుకెళ్ళారు కిరణ్ వర్మ.
- Is Congress govt. encouraging belt shops in rural areas to boost liquor sales?
- Revanth government stalls handloom weavers’ Cheyutha scheme
- Some traditional caste-based occupations and nomadic tribes disregarded in caste census
- Telangana economy in dire straits as revenue projections fall short
- Concerns emerge from MBCs and nomadic groups as caste survey gets underway
- అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం చేసిన రేవంత్: కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు
- ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం: కేటీఆర్
- రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు: హరీష్ రావు
- కేసీఆర్ మనిషిని మానవత్వంతో చూశారు.. మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదు: కేటీఆర్
- పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా: హరీష్ రావు
- బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది: కేటీఆర్
- రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం: హరీష్ రావు
- ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్థమయ్యింది.. వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం: కేసీఆర్
- ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టావో.. అక్కడ నుంచే మూసీ పాదయాత్ర ప్రారంభిద్దాం: రేవంత్‌కు హరీష్ రావు సవాల్
- కౌశిక్ రెడ్డి అంటే రేవంత్‌కి భయం పట్టుకుంది: కేటీఆర్