mt_logo

కేసీఆర్ ప్రధాని కావాలి… వెల్లువెత్తుతున్న వివిధ రాష్ట్రాల ప్రజల డిమాండ్

కేసీఆర్‌ యాన పంత్‌ ప్రధాన్‌ హ్వావే ఆహేత్‌.. తెలంగాణకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట. దానర్థం.. ‘కేసీఆర్‌ ప్రధాని కావాలి’ అని. తెలంగాణలోని పథకాలను చూసి తమనూ ఆ రాష్ట్రంలో కలపాలని నాలుగేండ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. అది కుదరకపోతే కేసీఆర్‌ ప్రధాని కావాలి, తెలంగాణ పథకాలు తమ దగ్గర పెట్టాలని బలంగా కోరుకొంటున్నారు. తెలంగాణకు ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా తమను కేసీఆర్‌ పాలనలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలుకా, నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలుకా, యావత్‌మాళ్‌ జిల్లాలోని ఝరిజామని తాలుకా, చంద్రపూర్‌ జిల్లాలోని సరిహద్దు గ్రామాలు, కర్ణాటకలోని బీదర్‌, గుల్బర్గా, యాద్గిర్‌, రాయచూర్‌ జిల్లాలకు చెందిన సరిహద్దు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అది వీలుకాకపోవటంతో ఇన్ని రోజులు నిట్టూర్చిన ఆ ప్రజలు కేసీఆర్‌ ప్రధాని కావాలనే ప్రకటనతో కొత్త జోష్‌లో ఉన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ వద్ద అమలవుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా, వితంతు పింఛన్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, భూ రికార్డుల ప్రక్షాళన, కల్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు సహా, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వస్తున్న అంతర్జాతీయ కంపెనీలు, పెరిగిన ఉపాధి ఉద్యోగావకాశాలు, భారీగా పెరిగిన భూములు, ఇండ్ల ధరలు అక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ‘కేసీఆర్‌ ప్రధాని కావాలి, మాకూ తెలంగాణ పథకాలు రావాలి’ అని దేశ ప్రజలు నినదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *