mt_logo

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం వింగ్ స్యూర్ సంస్థతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం

ప్ర‌పంచ వ్యాప్తంగా రైతుల‌ను కాపాడేందుకు కృత్రిమ మేధ‌ను, విస్తృత సాంకేతిక‌ను వినియోగిస్తున్న వింగ్ స్యూర్ సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వింగ్ స్యూర్ లోతైన సాంకేతిక ఆధారితంగా వ్యక్తిగతీకరించబడిన పంటల బీమా ఉత్పాదనలను, అవసరమైన శిక్షణను, సలహాలు, సేవలను చిన్న మరియు సన్నకారు రైతులకు అందించనుంది. అదే విధంగా సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాలను నిర్వర్తించనుంది. దానికి తోడుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక ద్వారా అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈ పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు బాధ్యత వహించనుండగా… వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్ సి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వ్యసాయాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించింది. వ్యవసాయ ఉత్పాదనను పెంచడంలో, రైతుల జీవనోపాధులను మెరుగుపరచడంలో కృత్రిమ మేధ, ఇతర ఆధునిక సాంకేతికతల అవసరాన్ని కోరుకుంటున్నది. వింగ్ స్యూర్ తో చేసుకున్న ఈ ఒప్పందం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడుతుంది. చిన్న, సన్నకారు రైతులకు వివిధ రకాల సేవలు అందించేందుకు సహకరిస్తుందన్నారు.

వింగ్ స్యూర్ వ్యవస్థాపకులు, సీఈఓ అవి బసు మాట్లాడుతూ…లక్షల మంది రైతులను ప్రభావితం చేసే అధునాతన సాంకేతికత, నూతన వ్యవసాయ పద్ధతులు, కృత్రిమ మేధ వంటి తదితర ప్రభుత్వ ఆశయాలకు తోడ్పాటు అందించడం మాకెంతో ఆనందదాయకం. వింగ్ స్యూర్ యొక్క విస్తృత సాంకేతికతతో శీతోష్ణస్థితి, ఇతర వాతారవరణ మార్పులను తెలుసుకోవచ్చు. అలాగే రైతులకు వ్యవసాయంలో శిక్షణలు, సలహాలు సూచనలు ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *