mt_logo

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల తరువాత భారీ వర్షం కురవనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ వారి ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శేరిలింగంపల్లి జోన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం పడే సూచనలున్నాయని ఏవిడిఎం శాఖ తన అధికారక ట్విట్టర్లో పేర్కొంది. అలాగే ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *