mt_logo

ఆరోగ్యరంగంలో తెలంగాణకు దేశంలో మూడవ ర్యాంకు

ఇప్పటికే అనేక రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇపుడు మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ విడుద‌ల చేసిన ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కాగా.. 2018-19 ఏడాదికి గానూ తెలంగాణ 4వ స్థానంలో నిల‌వ‌గా, 2019-20 ఏడాదిలో మూడో స్థానానికి చేరింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ, నాణ్య‌మైన వైద్యం అందించేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని చెప్ప‌డానికి ఈ ర్యాంకు నిద‌ర్శ‌నం.

రాష్ట్రాల వైద్య పురోగ‌తిపై 2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్టును నీతి ఆయోగ్ సోమ‌వారం విడుద‌ల చేసింది. కేర‌ళ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో, మూడవ స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిలిచింది. వైద్య వ‌స‌తుల్లో వ‌రుస‌గా 4వ సారి కేర‌ళ అగ్ర‌స్థానంలో నిలవగా.. పెద్ద రాష్ట్రాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చిట్ట‌చివ‌ర‌న నిలిచింది. చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరం అత్యుత్త‌మ ప‌నితీరును ప్ర‌ద‌ర్శించింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జ‌మ్మూక‌శ్మీర్ ముందున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *