mt_logo

పెన్సిల్, రబ్బర్ ధరలు అధికంగా పెంచారెందుకు..? మోడీకి ఘాటు లేఖ రాసిన ఆరేళ్ళ బాలిక

దేశంలో విపరీతంగా ధరలు పెరిగిన విషయం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, ఇలా విపరీతంగా ధరలు పెంచేస్తే ఎలా చదువుకొవాలని ప్రశ్నిస్తూ ప్రధానికి ఘాటు లేఖ కూడా రాసింది ఓ ఆరేళ్ళ బాలిక. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1 వ తరగతి చదువుతోంది. ఆమె పెన్సిల్, రబ్బర్‌ను క్లాస్‌లో పోగొట్టుకోగా… కొత్త పెన్సిల్ కొనమని తల్లిని అడిగితే ఆమె కీర్తిని పెన్సిల్, రబ్బర్ ధరలు పెరిగిపోయాయి… ప్రతీసారి కొనలేనని ఈ మధ్య తరుచుగా మందలిస్తోంది. అలాగే గత ఆదివారం ఆ చిన్నారీ మ్యాగీ ప్యాకెట్ కొనేందుకు ఐదు రూపాయలతో షాప్‌కు వెళ్లగా… మ్యాగీ ప్యాకెట్ ధర ఏడు రూపాయలు పెరిగినట్టు షాప్ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ పాప నిరాశతో ఇంటికెళ్లి మళ్లీ కొత్త పెన్సిల్ కోసం మారాం చేయగా తల్లి మందలించింది. దీని అంతటికీ ధరలు పెరగటమే కారణమని గ్రహించిన ఆ చిన్నారి కీర్తి … వెంటనే ధరల పెరుగుదలపై ప్రభాని మోడీకి లేఖ రాసింది. “ ప్రధాన మంత్రి జీ… నాపేరు కీర్తి దూబే. నేను ఒకటో తరగతి చదువుతున్నా. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్ , ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేన పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి ? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు. అని హిందీలో రాసి, తండ్రి విశాల్ దూబేకి ఇవ్వగా… న్యాయవాది అయిన తండ్రి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ లేఖ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *