mt_logo

తెలంగాణలో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు… ఎల్లో అలెర్ట్ ప్రకటించిన అధికారులు

మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు.

* సోమవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

* మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.

* ఈ నెల 3న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

* 4న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

* 5న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *