ప్రజలు టీఆర్ఎస్ కే బ్రహ్మరథం పడతారు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • October 27, 2021 3:46 pm

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడని, తలుచుకుంటే మేము ప్రధాని మోడి మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వాళ్లు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలను అక్కున చెర్చుకున్న వ్యక్తి కెసిఆర్ అని తలసాని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని, ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో గెలవడానికి గోడ గడియారాలు, బొట్టు బిళ్లలు, కుట్టు మిషన్‌లు పంచుతున్నారని, ఆయన ఎన్ని వస్తువులు పంచినా ప్రజలు ఓటు మాత్రం టీఆర్‌ఎస్‌కే వేస్తారని చెప్పారు. బండి సంజయ్ సత్య హరిచంద్రునిలా మాట్లాడుతున్నారని.. కరీంనగర్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమిటని తలసాని ప్రశ్నించారు.


Connect with us

Videos

MORE