mt_logo

మిథాని-ఒవైసీ ఫ్లైఓవర్ కు “ఏపీజే అబ్దుల్ కలాం” పేరు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో రెండవ అతి పొడవైన ఓవైసీ-మిథాని ప్లైఓవర్‌ మంగళవారం రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవుతో, మిథాని జంక్షన్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతి తక్కువ కాలంలో ఈ ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరాంఘర్, చంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనుంది. హైదరాబాద్ ప్రజలకు ఈ ఫ్లైఓవర్ ను అంకితం ఇస్తునట్టు తెలిపిన మంత్రి కేటీఆర్.. నగరంలోని డిఆర్డిఓ విభాగంలో విధులు నిర్వర్తించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం మిథాని-ఒవైసీ ఫ్లైఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *