mt_logo

రేపటి నుండి రైతుబంధు.. ఇప్పటివరకు మొత్తం 50 వేల కోట్లు : మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ నెల 28 నుండి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేసారు. రైతుబంధు పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో 43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగిందన్నారు. ఈ సీజన్ లో 7600 కోట్ల తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోందని అన్నారు. 10వ తేదీ డిసెంబరు నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు మరియు కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అందరూ అర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్లు జమచేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. ఇంతకుముందు మాదిరిగానే మొదట ఎకరా.. తర్వాత రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన ఆరోహణా క్రమంలో నిధులు జమ అవుతాయని అన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా రోమ్ నగరంలో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ ఎఫ్ఏఓ సదస్సు పేర్కొందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *