mt_logo

పేద ప్రజల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ సంతృప్తి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని ఓల్డ్ మారేడ్ పల్లిలో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… పేద ప్రజలు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా అప్పుల పాలవుతారని, కానీ సీఎం కేసీఆర్ ఆ బాధ లేకుండా ఇళ్ళు కట్టిస్తున్నారు, పెళ్లి కూడా చేస్తున్నారన్నారు. అంతే కాదు సామాన్యులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, రాష్ట్రంలో సామాన్య ప్రజల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ సంతృప్తి అన్నారు. ఇక్కడ ఉన్న స్థలాన్ని హౌసింగ్ బోర్డు నుండి జీహెచ్ఎంసీకి బదలాయించి డబుల్ బెడ్ రూమ్ లను సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కట్టించారన్నారు. ఈ డబుల్ బెడ్ రూమ్ లను చూసిన ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి సీఎం మాకుంటే బాగుండు అని అంటున్నారని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు కేటీఆర్ సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇలాంటి ఇండ్లు కట్టినది ఎక్కడ లేదన్నారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ కాబట్టే పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నారన్నారు. ఇక్కడ నిర్మించిన ఒక్కో ఇల్లు కోటి ఇరవై ఐదు లక్షల విలువ చేస్తుందన్నారు. 350 కోట్ల విలువైన స్థలంలో 468 ఇండ్లను నిర్మించారని, నల్లా బిల్లు లేకుండా కంటోన్మెంట్ కు 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూమి అయినప్పటికి సీఎం కేసీఆర్ మన కోసం రెవెన్యూ శాఖ నుండి క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. హస్మాత్ పేట్ నాలాను 10 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *