mt_logo

షీ టీమ్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ రన్

రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ రన్ ఏర్పాటు చేసింది. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. రానున్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా షీ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ 2కే, 5కే ర‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 6వ తేదీన ఉద‌యం 5:30 గంట‌ల‌కు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు వ‌ద్ద ఈ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ర‌న్‌లో ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు. ర‌న్‌లో పాల్గొనాల‌కునే వారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. షీ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో ర‌న్ చేస్తున్న www.ifinish.in అనే వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేష‌న్ల కోసం మార్చి 4న ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భ‌వ‌న్‌లో సంప్ర‌దించాల‌ని అధికారులు సూచించారు. రిజిస్ట్రేష‌న్లు మార్చి 5న సాయంత్రం 6 గంట‌ల‌కు ముగియ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *