ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గమని తెలిపిన మోడీపై… ‘అది ప్రధాని ప్రసంగంలో టెలీప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుంది అని నేను భావిస్తున్నానను’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొరబాటున ‘భోజన్’ అనే పదానికి బదులు ‘భజన్’ అని టైప్ అయ్యుంటుందని, అది తెలియక ప్రధాని ‘భజన్’ అని పలికి ఉంటాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. భారత్ 116 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో 101వ స్థానంలో ఉందని, మనం తక్షణమే పోషకాహార లోపంపై దృష్టిపెట్టి తగిన పరిష్కారం కనుగొనాలి కాని, ఇలాంటి హాస్య గుళికలతో సమయం వృథా చేసుకోరాదని కేటీఆర్ హితవు పలికారు.