mt_logo

విద్యార్థులు జాబ్ సీకర్స్ కాదు.. జాబ్ క్రియేటర్స్ గా ఎదగండి : మంత్రి కేటీఆర్

స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ లో భాగంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐసీఐఈటీ-2022) ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతమని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. జేఎన్టీయూ విద్యార్థులంతా వెళ్లి కాళేశ్వరం సందర్శించాలని కోరారు. దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే ఇంటింటికి మంచినీరు ఇస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మన ఇంటికి వెళ్లి చూస్తే అన్నీ ఇతర దేశాల వస్తువులే ఉంటాయని… ఈ 75 ఏళ్ల భారతం ఒక స్పార్క్ ను కోల్పోయిందని, దానిని మీ విద్యార్థులంతా భర్తీ చేయాలని సూచించారు. నేడు దేశంలో మసీదును కూలగొట్టి గుడి కడదాం అంటూ గతాన్ని తవ్వే పనిలో ఉండి, దేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాలకు ప్రాధాన్యం ఇస్తే మరో వందేళ్లు దేశం వెనుకబడుతుందని, సాంకేతికకు పెద్దపీట వేస్తే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అన్నారు. విద్యార్థులు జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా ఎదిగేందుకు కృషి చేయాలని సలహా మంత్రి కేటీఆర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *