తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేడు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించగా… సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి కేటీఆర్, సిద్దిపేట కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్ రావు, మెదక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి, హనుమకొండలో వినయ్ భాస్కర్, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దపల్లి జిల్లాలో కొప్పుల ఈశ్వర్, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగడి సునీత, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.