mt_logo

కులమతాల చిచ్చు పెట్టి ఓట్లు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు : మంత్రి కేటీఆర్

క్వాలిటీ అనగానే మనకు విదేశాలు గుర్తొస్తాయి.. కాని భారత్ అన్ని దేశాల కంటె ఎక్కువ క్వాలిటీ ఇవ్వగల శక్తి వంతమైన దేశమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని మారిగోల్డ్ హోటల్ లో క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చప్టర్ నిర్వహిస్తున్న 36వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… 1986 లో చైనా, ఇండియా రెండు దేశాల జీడీపీ ఓకేరకంగా ఉండేదాని, కానీ ఇప్పుడు చైనా ఎక్కువ వృద్ధి రేటుతో ప్రపంచంలోని టాప్ దేశాలతో పోటీపడుతోందన్నారు. చైనా సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్ తో, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్ లతో అభివృద్ధిలో దూసుకెళ్తడమే కారణం అన్నారు. అద్భుతమైన క్వాలిటీ ఉత్పత్తి మన దేశంలో కూడా ఉందని కాని క్వాలిటీ తక్కువగా ఉన్న చైనా ముందుకెళ్లడానికి కారణం… ఇక్కడ కుల, మతాలు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇవే మాటలతో నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇన్నేళ్ల భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాక వాళ్ళ ఊరుకు కరెంట్ వచ్చిందని తెలియజేశారు. దేశంలో 2022 వరకు కూడా కరెంట్, నీళ్లు లేని ఇల్లు ఉండటం మన దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *