mt_logo

ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్లు దేశంలో మొదటిస్థానంలో నిలవడానికి కారణం కేటీఆర్ నిర్ణయాలే : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఐటి, ఇండస్ట్రీ సెక్టార్లు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న 36వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… గతంలో కరెంట్ లేక పవర్ హాలిడేలు ఉండేవని, మౌలిక సదుపాయాలు లేక పరిశ్రమ వ్యవస్థ కుదేళ్లయ్యిందని గుర్తు చేశారు. 8 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు పరిశ్రమ రంగం, తెలంగాణ వచ్చాక, కెటిఆర్ పరిశ్రమల మంత్రి అయ్యాక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చన్నారు. టిఎస్ ఐపాస్ తో పరిశ్రమల అనుమతులు వేగంగా జరుగుతున్నాయని, 24 గంటల కరెంట్ ఇస్తూ పారిశ్రామిక రంగం ముందు కెళ్తుందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని, కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఐటి, ఇండస్ట్రీ సెక్టార్లు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. టీ హబ్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంతో పాటు మొదటి స్థానంలో నిలిచిందని కొనియాడారు. టీ వర్క్స్ అనే సంస్కరణ గొప్పగా సాగుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *