mt_logo

నాంపల్లిలో మినీ నుమాయిష్ ప్రారంభం

హైదరాబాద్ లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభ‌మైంది. ఆల్ ఇండియా ఇండ‌స్ట్రీయ‌ల్ ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10:30 గంట‌ల‌కు 300 స్టాల్స్ తెరిచి ఉండ‌నున్నాయి. నుమాయిష్‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌వేశం వ‌ద్ద శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని డిజిట‌ల్ థ‌ర్మామీట‌ర్‌తో ప‌రీక్షించి లోప‌లికి పంపేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక లోప‌ల జ‌నాలు ఫ్రీగా న‌డిచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ధ‌రించ‌ని వారిని నుమాయిష్‌కు అనుమ‌తించ‌మ‌ని నిర్వాహకులు స్ప‌ష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *