mt_logo

సండే-ఫండే కోసం సిద్దమైన చార్మినార్

ఈ నెల 17వ తేదీ నుండి ప్రతి ఆదివారం సండే-ఫండే ఫెస్టివల్ తో చార్మినార్ ప‌రిస‌రాలు క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి. ఇప్పటికే చార్మినార్ వ‌ద్ద‌ సండే – ఫ‌న్‌డే కార్య‌క్ర‌మానికి అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్ర‌తి ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. సాయంత్రం 6:30 గంట‌ల‌కు పోలీస్ బ్యాండ్, రాత్రి 8:30 గంట‌ల‌కు ద‌క్క‌నీ మ‌జాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక అర్ధ‌రాత్రి వ‌ర‌కు లాడ్ బ‌జార్‌ను తెరిచి ఉంచ‌నున్నారు. పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ప‌లు కార్య‌క్ర‌మాల‌తో పాటు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. సండే-ఫండే కు వ‌చ్చే వాహ‌న‌దారుల‌కు పార్కింగ్ స‌దుపాయాలు క‌ల్పించారు అధికారులు. ఈ మేరకు సిద్దమైన ఏర్పాట్ల గురించి అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *