రాబోయే రెండు రోజులు తెలంగాణాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
- Political gaslighting and its profound effects
- Priyanka Gandhi’s pressure: Minister Konda Surekha likely to resign soon
- No review, no funds: Revanth government neglected Bathukamma celebrations?
- 1.5 lakh houses in danger for Rs. 1.5 lakh cr Musi Beautification Project
- Office space absorption in Hyderabad plummets under Congress rule
- చిట్టి నాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు: కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్
- రేవంత్ రెడ్డి ఓ సైకో సీఎంలా తయారయ్యాడు: కౌశిక్ రెడ్డి
- రుణమాఫీపై దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా: హరీష్ రావు
- దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలి: కేటీఆర్
- టాలీవుడ్ అంతు చూస్తామంటూ రేవంత్ సైన్యం రౌడీయిజం!
- కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్కు గడ్డి పెట్టిన టాలీవుడ్!
- పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు
- మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.. కేటీఆర్ భరోసా
- ఢిల్లీలో ఉన్న గాంధీలు కాంగ్రెస్ అమానవీయ పాలనపై స్పందించాలి: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్