mt_logo

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ‘మన ఊరు – మన బడి’ : మంత్రి కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్న పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను మంత్రి పర్యవేక్షించారు. అదే విధంగా ప్రయోగాత్మకంగా పథకం పనులను చేపట్టిన మహబూబియా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాఠశాలల స్వరూపానికి, రాబోయే రోజులు పాఠశాలల స్వరూపానికి తేడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని కేటీఆర్‌ అన్నారు. నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ విద్యారంగంలో పలుమార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త పథకాల కారణంగా విద్యార్థులందరూ భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని 7,289.54 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నిధుల విడుదల దగ్గర నుంచి పనుల వరకు నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *