mt_logo

“లండన్-చేనేత బతుకమ్మ-దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్-చేనేత బతుకమ్మ-దసరా” వేడుకల పోస్టర్ ని సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు అని అన్నారు. అలాగే టాక్ నాయకుడు అనిల్ కూర్మాచలం బృందం నాడు తెలంగాణ ఉద్యమంలో సైతం ఎంతో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వైతాళికులని గౌరవించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చేస్తుందని, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను విశ్వవ్యాప్తం చెయ్యడానికి ఎంతో కృషి చేశారని మంత్రి తెలిపారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు వివిధ సందర్భాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి “చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. అక్టోబర్ 9వ తేదీనాడు ప్రవాసులంతా మధ్యాహ్నం 12 గం.ల నుండి వెస్ట్ లండన్ లోని ” ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్”( Isleworth and Syon School,Ridgeway Road,Isleworth,Middlesex,TW75LJ) ఆడిటోరియంలో జరిగే వేడుకలకు , ప్రవాస ఆడపడుచులంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనమంతా చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని అన్నారు. www.tauk.org.uk వెబ్సైట్ ను సందర్శిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని లేదా tauk.org@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చని సూచించారు. టాక్ కార్యదర్శి రవి రేతినేని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన సీఎం కేసిఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేత దుస్తులతో వేడుకలను జరువుపుకుంటే, చేనేత కుటుంబాలకు గొప్ప భరోసా ఉంటుందని రవి తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న వారిలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, కార్యదర్శి రవి రేతినేని తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *