mt_logo

ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అధికారికంగా నిర్వహిస్తున్నా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, Ch. ఉపేంద్ర హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది అని, అందుకు నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, మోడ్రన్ వాషింగ్ మిషన్లను రజకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ఆనాడు వలస పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *