mt_logo

సినిమా హబ్ (సి-హబ్) గా రవీంద్రభారతి: మామిడి హరికృష్ణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ఆరేళ్ళ కాలం నుండి సినీ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒక సినిమా హబ్ గా రూపుదిద్దుకుందని, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చేప్పే “ఐడియేశన్- ఇంక్యూబేషన్- ఇన్నోవేషన్” ల స్ఫూర్తితో ఇక్కడ ఒక ఐడియాను ఇంక్యూబేషన్ చేసి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన సినివారం అనే ఇన్నోవేషన్ ఒక సినీ స్టార్టప్ స్థాయికి ఎదిగిందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. సి-హబ్ గా మారిన ఈ సినివారంలో ప్రతివారం కొత్త సినిమాలను, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ వారికి ఒక గుర్తింపును, ఫిలింమేకింగ్ పై నమ్మకాన్ని కలిగిస్తున్నామని, తద్వారా ఆయా ఫిలింమేకర్స్ మరిన్ని సినిమాలు రూపొందించి వారి ఆలోచనలను, వారి టాలెంట్ లను నిరూపించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కాలంలో ఓటీటీల వేదికగా అనేక రకాల సినిమాలు చూసిన ప్రేక్షకులు తమ మైండ్ సెట్ మార్చుకొని, క్రియేటివిటి-కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, సెప్టెంబరు 25న ‘ప్రకృత్’ మరియు ‘వరం’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణ గారు చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… ఈనాటి సినివారంలో ‘ప్రకృతిని నాశనం చేయొద్దు, దాన్ని కాపాడుకుంటేనే మానవ జాతికి మనుగడ’ అనే నేపథ్యంలో గణేష్ దర్శకత్వం వహించిన “ప్రకృత్”, అలాగే ‘తల్లీకూతురు మధ్య అనుబంధం’ నేపథ్యంలో పవన్ దర్శకత్వం వహించిన “వరం” సినిమాలు సందేశాన్ని వినోదాన్ని అందించాయని తెలుపుతూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *