mt_logo

కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా… బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని సహా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లతో కలిసి ప్రారంభించిన కేటీఆర్.. ప్రభుత్వ పాఠశాలను అన్ని హంగులతో కార్పోరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, నవంబర్ 29న వరంగల్లో తలపెట్టిన సభకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *