ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండగా… అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూ పాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖ మ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వ రంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.