తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్‌క్లాస్ మౌల్డ్ యూనిట్‌ను, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థిరమైన, సామర్థ్యం ఉన్న ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందన్నారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. దిగుమతులు తగ్గించి.. స్థానికంగానే ఉత్పత్తి పెంచి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయన్నారు. సశ్య విప్లవంతో లక్షల ఎకరాల సాగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి ఉందని కేటీఆర్ తెలిపారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డైరీ.. నేడు ప్రభుత్వానికి డివిడెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి కూడా పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగనుందన్నారు. వచ్చే ఐదేండ్లలో 25లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
- KTR to tour Wanaparthi on Sep 29 to lay foundation stones for development works
- KCR directs officials to conduct Koppula Harishwar Reddy’s last rites with official honours
- Migration of BJP leaders into BRS continues
- Telangana Digital Media Wing Director Dileep Konatham bags ‘Social Media Person of the Year’ award
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- ఈనెల 27న 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం
- బీఆర్ఎస్ పోరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం.. ఇక ఓబీసీ బిల్లుకోసం గులాబీ పార్టీ ఉద్యమం!
- బండికి మించి నియంతృత్వం.. కిషన్‌రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్‌ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన
- ఇది కేసీఆర్ విజన్.. లోటువర్షపాతం ఉన్నా చెరువుల్లో నిండా నీళ్లు.. రిజర్వాయర్లలో నీళ్లు ఫుళ్లు!
- తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంకు ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం