mt_logo

రాష్ట్రంలో అంగన్వాడీలకు చేనేత చీరలు : మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, చేనేత – జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో… రాష్ట్రంలో అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పీ.ఆర్.సీ. ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది. గురువారం మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ చేనేత చీరలను అంగన్వాడిలకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత – జుట్ బ్యాగులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 31,711 మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మిని అంగన్వాడి కేంద్రాలలో పని చేస్తున్న 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు అభినందనలు తెలియజేస్తూ, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు అందించారు. అలాగే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంగన్వాడీలకు గౌరవ ప్రదమైన వస్త్రాలు..సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడి కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని, పిల్లలకు ప్రిప్రైమరీ విద్యతో పాటు, పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకునే విధంగా పని చేస్తున్నామని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *