ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తో గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… అంతర్జాతీయంగా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గ్రిడ్ డైనమిక్స్ ఈ రోజు భారతదేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు పేర్కొన్నారు.