శ్రమశక్తి అవార్డులు స్వీకరించిన అంగన్‌వాడీ టీచర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్రమశక్తి అవార్డులు సొంతం చేసుకున్న టీచర్లు నల్లా భారతి, ఆడెపు వరలక్ష్మి శనివారం టీఆర్‌ఎస్ అనుబంధ టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. శ్రమశక్తి అవార్డులు అందుకున్న స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ కార్యదర్శి నారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్‌సింగ్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర కార్యదర్శి బషీర్, పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.