తెలంగాణలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా గతంలో పని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తించనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇదివరకే సీఎం కేసీఆర్ హామీ ఇచిన విషయం తెలిసిందే.