mt_logo

10 లక్షల కొత్త ఆసరా పింఛన్ల కోసం రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుండి రాష్ట్రంలో మరో పది లక్షల కొత్త ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా నిధులు అదనంగా కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 35.95 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉండగా.. వారికోసం ప్రతినెలా రూ.800 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఇక ఇపుడు పెరగనున్న మరో 10 లక్షల పింఛన్లతో కలిపి 46 లక్షల మంది ఆసరా లబ్దిదారులకు గానూ ఇకపై రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వార్షికంగా 12వేల కోట్లు ఒక్క ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త పింఛన్లతో కలిపి లబ్ధిదారులందరికీ బార్‌కోడ్‌తో కూడిన పాస్‌పుస్తకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లను మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందివ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *