హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సెటైర్లు వేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్స్ చేశారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు వచ్చారు. కానీ ఇవాళనేమో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజన చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్ తన పోస్ట్స్ లో పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు.. నిర్ణయాత్మక రాజకీయాలు కావాలని తాను పదే పదే చెప్తున్నానని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.