దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం కాగా… తెలంగాణలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్మా ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికల భరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తారు. ఈఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708.

