గత మూడేళ్లుగా జూలై 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద విలువైన వస్తువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చి… రాష్ట్రంలోని వికలాంగులను, విద్యార్ధిని, విదార్దులను, రోగులను ఆదుకుంటున్నారు. మూడేళ్ల క్రితం తన పుట్టిన రోజున కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పథకానికి శ్రీకారం చుట్టి ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చారు. దానికి రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ముందుకు వచ్చి అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా వాటి సంఖ్య 120 కి చేరింది. అలాగే రెండో సంవత్సరం లో తాను వ్యక్తిగతంగా 200కు పైగా కస్టమ్ మేడ్ వాహనాలను వికలాంగుల కోసం విరాళంగా ఇవ్వగా….మళ్లీ ఎంపీలు, శాసనసభ్యులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున వికలాంగుల వాహనాలను విరాళం అందజేశారు. దీంతో వీటి సంఖ్య ప్రస్తుతం 1100లకు చేరింది. ఇక ఈ ఏడాది పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత హోదాలో సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కోచింగ్ మెటీరియల్‌తో కూడిన బైజు పవర్డ్ టాబ్లెట్‌లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పెద్దఎత్తున ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం సంతోషంగా ఉందని వెల్లడించిన కేటీఆర్… తన పట్ల వారు కురిపిస్తున్న ఆప్యాయతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడనని, ‘గిఫ్ట్ ఎ స్మైల్’ నిజంగా తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తి నిస్తోందన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కేటీఆర్ తన అనుచరులు, శ్రేయోభిలాషులకు పిలుపునివ్వగా… ఆ మేరకు పలువురు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ముందుకు వచ్చి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎల్‌సి శంభీపూర్ రాజు కుత్భుల్లాపూర్ నియోజవకర్గం పరిధిలోని శాపూర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోగా నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి మూడు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి రూ.8 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. కాగా శాసనసభ్యులు గాంధీ ఆరెకపూడి, చల్లా ధర్మారెడ్డి తమ క్యాంపు కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గతంలో రామవరం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కింద కొత్త అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ క్రిశాంక్ రసూల్‌పురాలో పాఠశాల విద్యార్థులకు రెయిన్‌కోట్‌లను పంపిణీ చేశారు మరియు కంటోన్మెంట్‌లోని మారేడ్‌పల్లిలోని ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల హాస్టల్‌లో పిల్లలకు పాఠశాల యూనిఫాంలను విరాళంగా అందజేశారు. రాష్ట్ర స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి గిఫ్ట్ ఎ స్మైల్ ఇనిషియేటివ్ కింద ఇద్దరు వికలాంగులకు కస్టమ్ మేడ్ ‘ఈ-వెహికల్స్’ను అందజేశారు.
- Leaders from across country arrive in Telangana to take on CM KCR
- CM KCR addresses over 90 public meetings in his whirlwind poll campaign
- KTR slams Congress Party for stopping Rythu Bandhu
- KTR promises a ‘Tripartite Welfare Board’ for Gig workers in Telangana
- Congress eyes electricity from Telangana to overcome power crisis in Karnataka
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్‌లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
- ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు: కేటీఆర్
- ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్
- 111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్
- ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదు: సీఎం కేసీఆర్
- బద్మాష్ ప్రచారాలను చేస్తోంది కాంగ్రెస్: సీఎం కేసీఆర్
- కాంగ్రెస్‌ని నమ్మితే రైతు రోడ్డున పడాల్సి వస్తది: సీఎం కేసీఆర్
- రైతుబంధువును ఆదరించండి.. రాబందులను తరిమికొట్టండి: కేటీఆర్