టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూలై 24న తన పుట్టిన రోజును పురస్కరించుకొని సిరిసిల్ల ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు చేయూతనివ్వనున్నారు. తన పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బైజూస్ పవర్డ్ టాబ్లెట్‌లు, సాఫ్ట్‌వేర్ అండ్ కోచింగ్ మెటీరియల్‌ని సొంత నిధులతో పంపిణీ చేయనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మెరుగైన శిక్షణ పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.