సింగరేణి తెలంగాణదే… ఏపీకి సంబంధం లేదు : అంగీకరించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి

  • January 13, 2022 11:38 am

బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పునర్విభజన అంశాల పరిష్కారంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సింగరేణి తెలంగాణకు చెందినదేనని తేల్చారు శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల మధ్య జరిగిన వాదనలపై తెలంగాణ వాదన చట్టబదద్దంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ బృందం, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ అధికారుల బృందం పాల్గొంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాలున్నాయేగానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది విభజన చట్ట ప్రకారమే ఉన్న నిబంధనని, దీనిపై ఏపీ ప్రభుత్వం అడ్డంతిరిగి వాదించడంలో అర్ధంలేదని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎస్ వాదనలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా కూడా అంగీకరించి తెలంగాణ వాదనలోనే వాస్తవముందని అంగీకరించారు. సింగరేణి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తే ఎలాంటి అభ్యర్ధనను కూడా స్వీకరించ కూడదని తెలంగాణ సీఎస్ కోరగా అందుకు హోంశాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిసింది. అంతేగాక సింగరేణి కాలరీస్‌కు అనుబంధంగా ఉన్న ఏపీహెచ్‌ఎంఈఎల్ (ఆప్మెల్) యాజమాన్యానికి సంబంధించిన సమస్యపైన కూడా తెలంగాణ సీఎస్ గట్టిగా పట్టుబట్టారు. భవష్యత్తులో కూడా ఆప్మెల్ తెలంగాణకే కొనసాగుతుందని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టంచేశారు.


Connect with us

Videos

MORE