mt_logo

జాతీయ విద్యాలయాలపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

ప్రతీరంగంలో తెలంగాణపై శీతకన్ను చూపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తున్న ఎన్డీఏ ప్ర‌భుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం విస్మరించిందని తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడులో ఒకే రోజు 11 వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని చేసిన ట్వీట్‌పై కేటీఆర్ పైవిధంగా స్పందించారు. గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పినా.. ఇప్పటికీ మంజూరు చేయలేదన్నారు. గత ఏడు సంవత్సరాల్లో కేంద్రం ఇత‌ర రాష్ట్రాల‌కు మంజూరు చేసిన విద్యాసంస్థ‌ల‌ వివరాలను మంత్రి కేటీఆర్ ట్వీట్ కు జత చేశారు. ‘‘జాతీయ యువజ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర యువ‌త‌, విద్యార్థుల త‌ర‌పున అడుగుతున్నాను.. తెలంగాణ‌కు విద్యాల‌యాలు కేటాయించి, తప్పును స‌రిదిద్దుకోవాలి.’’ అని మోడీకి కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *