సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్..

  • February 4, 2019 5:27 pm

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో బిజీగా పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పదవ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్లలో జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద టన్నెల్ పనులు, సర్జిపూల్ పంప్ హౌజ్ పనుల పురోగతిపై కేటీఆర్ అధికారులతో చర్చించారు. అంతకుముందు మానేరు నది ఒడ్డున నిర్వహించిన గంగమ్మ తల్లి కళ్యాణోత్సవ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. గంగమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మండలేశ్వర స్వామిని కేటీఆర్ దర్శించుకున్నారు.


Connect with us

Videos

MORE