ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ అనేది ఉపశీర్షిక. ఇందులో మల్లేశం పాత్రలో టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ చిత్ర టైటిల్ లోగోను ట్విటర్‌లో షేర్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయగా.. తాజాగా కేటీఆర్ షేర్ చేశారు. తెలంగాణకు చెందిన ”మల్లేశం: ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ” మ్యాన్ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ ఆర్, శ్రీ అధికారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మణ్ ఆలే ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
హీరో:ప్రియదర్శి, హీరోయిన్: అనన్య
మాటలు: పెద్దింటి అశోక్
పాటలు: గోరేటి వెంకన్న, చంద్రబోస్
సంగీతం: మార్క్ రాబెన్,
ముఖ్య తారాగణం: బిత్తిరి సత్తి, ప్రముఖ యాంకర్ ఝూన్సీ, జగదీశ్, అశ్విన్