అంబేద్కర్ విధానాలను అవలంబిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు కర్నెప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించుకుని ఇవాళ్టికి 66 ఏళ్ళు అని, సామాన్యుడికి సైతం అవకాశం ఇచ్చేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ప్రతిపక్షాల నేతలు ప్రజలను అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడిని పార్లమెంట్ కు పంపిన ఘనత టీఆర్ఎస్ దేనని ఆయన పేర్కొన్నారు.