రైతు సమస్యలపై చర్చించాలని తొలిరోజే పార్లమెంట్‌లో నిరసన చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. లోక్‌సభ మొదలైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస మంత్రులు పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని, తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో తెలంగాణ నేతలు సభలో నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ‘రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు’. ‘వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి’ అనే ప్లకార్డులను టీఆర్ఎస్ ఎంపీలు ప్రదర్శించారు.