mt_logo

ధాన్యం కొనుగోలుపై లిఖిత పూర్వక హామీకి పట్టు

వానాకాలం ధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం, టీఆర్ఎస్ ఎంపీలు మంళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొన‌సాగిన ఈ స‌మావేశంలో ధాన్యం సేక‌ర‌ణ‌పై చ‌ర్చించగా… ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లిఖిత‌పూర్వ‌కంగా ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌.. రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని చెప్పారు. కాగా అప్పటివరకు రైతుల విష‌యంలో రాజీలేని పోరాటం చేస్తామ‌ని ఎంపీలు, మంత్రులు తేల్చిచెప్పారు. రైతుల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్ర‌మే అని, కావాలనే రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ తో పాటు.. పార్లమెంట్ సభ్యులు కే. కేశవరావు, నామా నాగేశ్వర రావు, డా.రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *