mt_logo

టీహబ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో యువతకి ఉద్యోగ కల్పనే ద్యేయంగా ప్రారంభమైన టీ హబ్ తెలంగాణలో స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం రెండో దశ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ట్రిబుల్‌ ఐటీలో ఉన్న టీ హబ్‌ కి కావాల్సిన స్థలం సరిపోకపోవడంతో.. కొత్తగా విశాలమైన ప్రాంగణమైన మాదాపూర్‌-రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్‌2ను నిర్మించారు. జెట్ స్పీడ్ తో మొదలైన ఈ ప్రాంగణ నిర్మాణం ప్రసుత్తం పూర్తి కావడంతో వచ్చే నెలలో ఈ సువిశాల టి హబ్ 2ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన టీహబ్‌-2 ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా మారనుంది. ఇక్కడ ఒకేసారి 1,500 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను, పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *