మరో అరుదైన రికార్డ్ సాధించిన తెలంగాణ

  • September 22, 2022 12:47 pm

తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలో బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) గ్రామాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. అలాగే అతి త్వరలో వందశాతం ఓడిఎఫ్ రాష్ట్రంగా కూడా నిలవబోతోంది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండగా, 12,766 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారాయి. అంటే ప్రస్తుతం 99.98 శాతం గ్రామాలకు మల విసర్జన రహిత సౌకర్యాన్ని కల్పించి టాప్ ప్లేస్‌లో తెలంగాణ దూసుకెళ్తుంది. మరో మూడు గ్రామాలకు ఓడిఎఫ్ సౌకర్యాన్ని విస్తరిస్తే… దేశంలోనే వంద శాతం సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందనుంది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 20 ఉత్తమ గ్రామాల్లోనూ తెలంగాణ నుంచి 19 గ్రామాలు ఉండడం విశేషం.


Connect with us

Videos

MORE